Sadar(Festival)
Sadar(Festival) :
సదర్ పండగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ఈ పండగను నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. 'సదర్' అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం 'ప్రధానమైనది' అని అర్థం. యాదవ కులస్తులు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా ఈ సదర్‌ను నిర్వహించుకుంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం.[1]
సదర్ పండగ సందర్భంగా ముస్తాబుచేసిన దున్నపోతు
హైదరాబాద్‌లో తప్ప సదర్ పండగ దేశంలో మరే ఇతర ప్రాంతాల్లో జరగదు. తమ జీవనాధారమైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలను కూడా వేడుకలు జరిగే ప్రాంతాలకు తీసుకువస్తారు. నగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్‌మారెడ్ పల్లి, చప్ప ల్‌బజార్, మధురాపూర్,karwan, పాతబస్తీ తదితర మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకూ నారాయణగూడలో జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్శించే స్థాయిలో సాగుతున్నాయి. యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్ డివిజన్లు, కాలనీలు, అపార్టుమెంట్ల ప్రాంగణాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రభావం నేపథ్యంలో 2009 నుండి ఈ ఉత్సవాలు కొత్త పుంతలను తొక్కాయి. ఇందుకోసం ఉత్తర భారతదేశం లోని పంజాబ్, హర్యానాల నుంచి భారీ శరీరం కలిగిన దున్నపోతులను నగరానికి తీసుకువస్తారు.
0 comments