కాళ్లతో కవితలు రాసి ఎందరినో కదిలించిన సిరిసిల్ల రాజేశ్వరి మరణించింది.

by - Thursday, December 29, 2022

           "చెదిరినా నా జీవితాన్ని చిత్రంగా మార్చేశావు..

           దీపం ఉంది కానీ.. వెలుగు లేదు..

           మనసు ఉంది కానీ.. బాధతో నిండిపోయింది..

            మనిషి ఉంది కానీ.. నిర్జీవంగా ఉండిపోయింది.." అంటూ కవితలు రాసి ఎన్నో మనసులు గెలిచిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేదు.

       సిరిసిల్ల రాజేశ్వరి గురించి అందరికి తెలుసు అనుకుంటున్న నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి ,తన వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా సెల్ఫ్ కాంఫిడెన్స్ తో కాళ్ళనే చేతులుగా మల్చుకొని అక్షరాలు నేర్చుకొని కవితలు రాసిన ఎంతో మందికి ఆదర్శనంగా నిలిచింది. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.  



      సిరిసిల్ల రాజేశ్వరి గురించి :


నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి ,తన వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా సెల్ఫ్ కాంఫిడెన్స్ తో కాళ్ళనే చేతులుగా మల్చుకొని అక్షరాలు నేర్చుకొని కవితలు రాశారు,

"సంకల్పం ముందు వైకల్యం ఎంత! ధృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత!ఎదురీత ముందు విధిరాత ఎంత!పోరాటం ముందు ఆరాటం ఎంత!"

  ఇది చదువుతుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది దానిలో అర్ధం చాల మందికి స్ఫూర్తిగా ఉంటుంది, అన్ని సరిగా ఉన్న మనమే ఎం చేయలేకపోతునం అలాంటింది వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా ఒక చరిత్ర రాసుకున్న తాను చాల గ్రేట్,తన ఆత్మకి శాంతి చేకూరాలని మన అందరం కోరుకుందాం. 


“కలలు కనేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి.. కలల తీరం చేరాలంటే నిప్పుల బాటలో నడవాలి మరి.. అక్షరం పక్కన అక్షరం చేర్చి నడిచాను.. గమ్యం చేరేసరికి అది మధుర కావ్యమై నన్ను చేరుకుంది..!”

“కన్నీళ్లను కలం చేసి మనసును అక్షరాలుగా మలిచి బాధను తలచి రాస్తున్నాను.. ఈ కావ్యాన్ని కవిత కోసం నేను పుట్టాను.. కాంతికోసం కలం పట్టాను.. వడగాడ్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం..!”

“నా రూపాన్ని వైకల్యం చుట్టుకున్నంత మాత్రాన నాలోని సాహిత్యకళ ఆగదు.. వెలుగుతున్న చంద్రునికి కళ్లు లేవు, అయినా వెలుగుతూనే ఉంటాడు.. పారే జలపాతానికి కాళ్లు, అయినా జలజల పారుతూనే ఉంటుంది.. నాకు చేతులు లేవు, అయినా నాలో కవిత సాగుతూనే ఉంటుంది..!” అంటూ సిరిసిల్ల రాజేశ్వరి కవిత ఝరి సాగింది."



You May Also Like

0 comments